కావలసిన పదార్థాలు :-
మినప్పప్పు-1 కిలో,
దోసె బియ్యం-2 కిలోలు.
మెంతులు-10గ్రా,
అటుకులు-30గ్రా,
బియ్యం పిండి-100గ్రా,
పంచదార-10గ్రా,
ఉప్పు-తగినంత.
తయారుచేయు విధానం :
మినప్పప్పు, దోసె బియ్యం, మెంతులు, అటుకులను మంచినీటిలో గంటసేపు నానబెట్టుకోవాలి.
వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు రుబ్బుకొని దానిని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
అందులో బియ్యంపిండి, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి.
అంతే - దోసె పిండి రెడీ అయినట్లే! ఇప్పుడు స్టవ్‌పై పెనం ఉంచి, చిన్న గిన్నెతో దానిపై దోసె పిండి వేసి, అదే గిన్నెతో నిలువు తక్కువగా, అడ్డం ఎక్కువగా(బాదంకాయ ఆకృతిలో) రుద్దాలి.
ఒక్క నిమిషం ఆగి, దోసెపైన చూట్టూరా నూనె వేసి, ఎర్రగా కాలే వరకు ఉంచి అట్లకాడతో దోసెను మడతేసి పక్కనున్న ప్లేట్లో పెట్టుకోవాలి.
అంతే - 70 ఎంఎం దోసె రెడీ.
