కావలసిన పదార్థాలు:-
కాలీఫ్లవర్: మీడియం సైజుది,
ఉల్లిపాయ: పెద్దది ఒకటి,
అల్లం వెల్లుల్లి ముద్ద: టేబుల్ స్పూను,
ఉప్పు: రుచికి సరిపడా,
మైదా: అరకప్పు,
మొక్కజొన్న పిండి: రెండు స్పూన్లు,
కారం: రెండు టేబుల్ స్పూన్లు,
పచ్చిమిరపకాయలు: రెండు,
జీడిపప్పు: పది పదిహేను,
పాలు: అరకప్పు,
టమోటా గుజ్జు: టేబుల్ స్పూను,
నూనె: తగినంత,
వెన్న: నాలుగు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం:-
ముందుగా పాలల్లో జీడిపప్పును 30 నిమిషాలు నానపెట్టుకోవాలి.
అనంతరం పాలల్లోంచి వాటిని తీసి ముద్దగా నూరి పెట్టుకోవాలి.
ఇప్పుడు మైదా, మొక్కజొన్నపిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు అన్నీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని కాలీఫ్లవర్ ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
ముప్పావు గంట అయిన తరువాత మందపాటి గిన్నె లేదా బాండీ తీసుకొని నూనె వేసి కాగిన తరువాత కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
ఇప్పుడు మరొక గిన్నెలో వెన్న వేసి కరిగిన తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.
ఉల్లిపాయముక్కలు వేగిన తరువాత కాలీఫ్లవర్ ముక్కలు టమోటాగుజ్జు కూడా జతచేసి మరికొద్ది సేపు వేయించుకోవాలి.
ఇప్పుడు మిగిలిన పాలు జీడిపప్పు ముద్ద కూడా జతచేసి కొద్దిగా వెన్నను చివరగా వేసుకోవాలి. ఇది ఫ్రైడ్‌రైస్‌లోకి రుచిగా ఉంటుంది.
