కావాల్సిన పదార్థాలు :-
ఎముకలు లేని మటన్ : పావు కిలో (చిన్న ముక్కలు)
ఉప్పు : తగినంత
అల్లం వెల్లుల్లి పేస్టు : ఒక స్పూను
నీళ్లు : ఒక కప్పు
నూనె : రెండు లేదా మూడు స్పూన్లు
కారంపొడి : రెండు స్పూన్లు
ఎలా చేయాలి?:-
కుక్కర్‌లో నూనె పోసి.. శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలను వేయాలి.
ఉప్పు కలిపి ఉడికించాలి.
ఐదు నిమిషాలయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు, నీళ్లు పోసి కలపాలి.
చిన్న మంట మీద పదిహేను నిమిషాలు ఉడికించాలి.
నీళ్లు ఇమిరిపోయే వరకు స్టవ్ మీదే ఉంచాలి.
ఒక బౌల్ తీసుకుని అందులోకి ఉడికిన మటన్‌ను వేసుకోవాలి.
పాన్‌ను తీసుకుని నూనె వేసి.. అల్లం వెల్లుల్లి పేస్టును వేయాలి.
అందులో ఉడికించిన మటన్ ముక్కల్ని వేసి.. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి.
కారంపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరం అనుకుంటే ఇందులోకి నిమ్మకాయ పిండుకుని తింటే రుచికరంగా అనిపిస్తుంది.
