అరటి దోశ

కావలసిన పదార్థాలు:-
బియ్యం - 2 కప్పులు,
మినపప్పు - అరకప్పు,
అరటిపండ్లు - 3,
పంచదార - 1 టీ స్పూను,
మెంతులు - రెండు చిటికెలు,
పచ్చిమిర్చి - 2,
నెయ్యి లేక వెన్న - కాల్చడానికి సరిపడా,
ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం:-
బియ్యం, మెంతులు కలిపి 6 గంటలపాటు నానబెట్టి, నీరు వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
పిండిలో కొద్దిగా వేడి నీరు, ఉప్పు కలిపి జారుగా చేసి మరో ఆరుగంటలు పక్కనుంచాలి.
అరటిపళ్లని, పచ్చిమిర్చిని సన్నగా తరిగి, ఉప్పు, పంచదారతో పాటు పిండిలో కలిపి (దళసరిగా) దోశలు పోసుకొని రెండువైపుల దోరగా కాల్చుకోవాలి.
పిల్లలు బాగా ఇష్టపడే దోశలివి.