కావాల్సిన పదార్థాలు :-
జీడిపప్పు : ఒకటిన్నర కప్పు
పంచదార : ఒక కప్పు
నీళ్లు : ఏడు టేబుల్ స్పూన్లు
రోజ్‌వాటర్ : టీ స్పూను
యాలకుల పొడి : 1 స్పూను
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
బటర్ పేపర్స్ : రెండు
తయారీ విధానం:-
ముందుగా జీడిపప్పును నెయ్యిలో దోరగా వేయించి చల్లార్చాలి.
మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి.. పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో ఏడు టేబుల్‌స్పూన్ల నీళ్లు వేసి.. పంచదార వేయాలి.
అందులో రోజ్ వాటర్, యాలకులపొడి కూడా కలపాలి.
పంచదార కరిగిన తరువాత జీడిపప్పు పౌడర్‌ను వేసి.. కలియబెట్టాలి.
మెత్తటి ముద్దలా తయారు చేసుకోవాలి.
గట్టిగా ఉంటే.. చేతిలోకి కాస్త నెయ్యి వేసుకుని ఒత్తితే మెత్తగా వస్తుంది.
ఆ తరువాత బటర్ పేపర్ మీద.. ముద్దను పల్చగా పరచాలి.
కత్తి తీసుకుని బర్ఫీ సైజ్‌లో చతురస్త్రాకారంలో కట్ చేస్తే.. కాజు బర్ఫీ రెడీ అయినట్లే..!
