అలసంద సొరకాయతో వడలు

కావలసిన పదార్థాలు:-
అలసందలు - ఒక కప్పు,
సొరకాయ తురుము - ఒక కప్పు,
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు,
పచ్చిమిర్చి పేస్టు - ఒక టీ స్పూను,
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను,
ఉప్పు - రుచికి తగినంత,
జీలకర్ర - టీ స్పూను,
పుదీనా తురుము - ఒక టీ స్పూను,
కొత్తిమీర తురుము - ఒక టీ స్పూను,
నూనె - సరిపడినంత.
తయారుచేసే విధానం:-
రాత్రి నానబెట్టిన అలసందలను ముద్దగా నూరి అందులో వేసి ముద్దగా కలుపుకుని పదినిమిషాలు ఉంచాలి.
తర్వాత కడాయిలో నూనె పోసి కాగాక, పిండిని గారెల మాదిరిగా ఒత్తుకుని దోరగా వేగించి తీసుకోవాలి.
ఈ సొరకాయ వడలు కొబ్బరి పచ్చడితో తినడానికి బాగుంటాయి.