కావలసిన పదార్థాలు :-
బ్రెడ్ ముక్కలు- పది,
తరిగిన ఉల్లిపాయ- ఒకటి,
తరిగిన టమోటాలు- మూడు,
తరిగిన పచ్చిమిర్చి- నాలుగు,
ఆవాలు- ఒక టీ స్పూను,
జీలకర్ర- ఒక టేబుల్ స్పూను,
కరివేపాకు- కొద్దిగా,
కారం- ఒక టీ స్పూను,
పసుపు- అర టీ స్పూను,
నూనె- రెండు టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర- కొద్దిగా,
ఉప్పు- తగినంత.
తయారీ విధానం :-
ఒక బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలను వేసి వేగించాలి.
సగం టమోటా ముక్కలను మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దతో పాటు టమోటా ముక్కలను, కారం, ఉప్పు వేసి 5 నిమిషాలు వేగించాలి.
ఆ తర్వాత మిగిలిన నూనె కూడా వేసి బ్రెడ్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.
వీటిని ముదురు రంగు వచ్చేదాకా వేగించి కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.
