పుచ్చకాయ హల్వా

కావలసిన పదార్థాలు:-
పుచ్చకాయ గుజ్జు - 1 కప్పు (తొక్క అడుగునుండే తెల్లని భాగాన్ని తురిమి పిండుకోవాలి)
పాలు - 1 కప్పు
పంచదార - పావు కప్పు
నెయ్యి - 2 టే.స్పూన్లు
కుంకుమ పువ్వు - కొద్దిగా
యాలకుల పొడి - చిటికెడు
హల్వాపై అలంకరణకు సరిపడా ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పులు.
తయారీ విధానం:-
బాండీలో నెయ్యి వేసి పుచ్చకాయ తురుము వేసి వేయించాలి.
నీరు మొత్తం ఇగిరిపోయాక పాలు పోసి మీడియం మంట మీద చిక్కబడేవరకూ కలుపుతూ ఉండాలి.
యాలకుల పొడి వేసి కలపాలి.
పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు కలపాలి.
చివర్లో నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షతో అలంకరించి సర్వ్‌ చేయాలి.