అటుకుల పాయసం

కావలసిన పదార్థాలు:-
(పలచని) అటుకులు, బెల్లం తురుము - పావు కేజీ చొప్పున,
యాలకుల పొడి - అర టీ స్పూను,
కిస్‌మిస్‌, బాదం తురుము, జీడిపప్పు - అరకప్పు,
నెయ్యి - 3 టీ స్పూన్లు,
కొబ్బరి పొడి - అరకప్పు,
పాలు - పావు లీటరు.
తయారుచేసే విధానం:-
అటుకులు కడిగి అరగంట సేపు నానబెట్టాలి.
నీరు పిండి, కొత్తనీరు పోసి ఉడికించాలి.
కడాయిలో నెయ్యి వేసి బాదం తురుము, జీడిపప్పులు, కిస్‌మిస్‌ వేగించి అటుకులు, యాలకుల పొడి వేసి సన్నని మంటపై ఐదు నిమిషాలు ఉంచాలి.
తర్వాత కొబ్బరి పొడి, బెల్లం తురుము, (వేడి చేసిన) పాలు ఒకటి తర్వాత ఒకటి కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి.
వేడి వేడిగా తిన్నా, లేదా చల్లారిన తర్వాత తిన్నా రుచిలో మార్పు ఉండని పాయసం ఇది.