కావాల్సిన పదార్థాలు:-
ఆవు పాలు - 4 కప్పులు,
అంజీర్ ముక్కలు - ఒకటిన్నర కప్పు,
నిమ్మరసం - 1 టీస్పూను,
కార్న్‌ఫ్లోర్ - 1 టీస్పూను (ఒక టే.స్పూను ఆవు పాలలో కరిగించుకోవాలి),
ఖోయా - అర కప్పు,
చక్కెర - 2 టే.స్పూన్లు.
తయారీ విధానం:-
అంజీర్ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచి చల్లబరుచుకోవాలి.
నాన్‌స్టిక్ ప్యాన్‌లో పాలు పోసి మరిగించాలి.
చిన్న మంట మీద ఉంచి తిప్పుతూ ఉండాలి.
నిమ్మరసం కొద్ది కొద్దిగా వేసి కలుపుతూ ఉంటే పాలు విరిగిపోతాయి.
తర్వాత కార్న్‌ఫ్లోర్, ఖోయా, చక్కెర వేసి కలిపి చిన్న మంట మీద మరో 2 నిమిషాలు ఉడికించాలి.
ఫ్రిజ్‌లో గంటపాటు ఉంచాలి.
తర్వాత చల్లబడిన అంజీర్ ముక్కలు కలిపి సర్వ్ చేయాలి.కలపాలి.
