చెట్టినాడ్‌ చికెన్‌

కావలసినవి:-
కిలో చికెన్‌,
మూడు చెంచాల వెనిగర్‌,
రెండు చెంచాల నూరిన అల్లం,
రెండు ఉల్లిగడ్డలు,
ఒక చెంచా సోంపు,
ఒక చెంచా మెంతులు,
రెండు చెంచాల కారం,
రెండు చెంచాల దనియాలు,
అర చెంచాడు మిరియాలు,
ఒక చెంచాడు డాల్డా,
అర చెంచాడు ఆవాలు,
ఒక కప్పు తాజా కరివేపాకు రెమ్మలు
ఎలా చేయాలి:-
నూనె, ఆవాలను మినహాయించి పై పదార్థాలతో చికెన్‌ను బాగా మిక్స్‌ చేయండి.
ఒక రాత్రంతా నానబెట్టి ఉంచండి.
ఆ తరువాత కడాయిలో నీళ్లుగాని, నూనెగాని వేయకుండా కొద్ది సేపు వేగించండి.
వేరే కడాయిలో నూనె వేసి వేడిచేయండి.
దీనిలో ఆవాలు,కరివేపాకు వేసి చిటపటమన్నాక ఇప్పుడు చికెన్‌ మిశ్రమాన్ని నూనెలో దోరగా వేయించండి.
హాట్‌ హాట్‌గా ఈ చెట్టినాడ్‌ చికెన్‌ను రొట్టెలతో సర్వ్‌ చేయండి.చాలా రుచికరంగా ఉంటుంది.