బొమ్మిడాయిల పులుసు

కావలసిన పదార్థాలు:-
శుభ్రం చేసిన బొమ్మిడాయిలు - అరకేజీ,
ఉప్పు, కారం, పసుపు - సరిపడా,
ఉల్లి తరుగు - ఒక కప్పు,
పచ్చిమిర్చి - 4,
కరివేపాకు - 4 రెబ్బలు,
టమోటా తరుగు - పావు కప్పు,
చింతపండు గుజ్జు - పావు కప్పు,
ధనియాల పొడి, జీరాపొడి - ఒక్కో టీ స్పూను చొప్పున,
నూనె - 3 టేబుల్‌ స్పూన్లు,
నీరు - అరకప్పు.
తయారుచేసే విధానం:-
ఒక పాత్రలో బొమ్మిడాయిలు, (కొద్దిగా) ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కనుంచాలి.
నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, టమోటా తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి.
తరుగు మెత్తబడ్డాక బొమ్మిడాయిలు, ధనియాల పొడి, జీరాపొడి కలిపి 5 నిమిషాలు మగ్గించాలి.
ఇప్పుడు చింతపండు గుజ్జు, నీరు పోసి మూత పెట్టి చిన్న మంటపై (కలపకుండా) ఉంచాలి.
పులుసు చిక్కబడ్డాక రుచికి సరిపడా ఉప్పుతో పాటు కొత్తిమీర చల్లి రెండు నిమిషాల తర్వాత మంట తీసెయ్యాలి.