అరటి హల్వా

కావలసిన పదార్థాలు:- బాగా పండిన అరటిపళ్లు - 5,
బెల్లం తురుము - 2 కప్పులు,
నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు,
మైదా - 2 టేబుల్‌ స్పూన్లు,
పంచదార - అరకప్పు,
యాలకుల పొడి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం:-
అరటిపళ్లని పలచగా చక్రాల్లా తరిగి, అరకప్పు నీటిలో మెత్తగా ఉడికించి చిదిమి పక్కనుంచాలి.
మరో అరకప్పు నీటిలో బెల్లం కరిగించాలి.
కడాయిలో నెయ్యి వేసి అరటి గుజ్జుని 6 -7 నిమిషాలు వేగించాలి.
తర్వాత బెల్లం నీరు కలిపి చిన్నమంటపై 10 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి.
మిశ్రమం చిక్కబడిన వెంటనే పంచదార, యాలకులపొడి కలిపి మరో 7 నిమిషాలు ఉంచాలి.
‘గోల్డెన్‌ బ్రౌన్‌’ కలర్‌లోకి వచ్చిన తర్వాత మైదా కలపాలి (తడి పోవడానికి).
రెండు నిమిషాల తర్వాత నెయ్యిరాసిన పళ్లెంలో మిశ్రమం సమంగా పరిచి, చల్లారిన తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.