బాదం పూరీ

కావలసిన పదార్థాలు:-
మైదా- 1 కప్పు,
బాదం పేస్ట్‌- 1/4 కప్పు,
బియ్యప్పిండి- 1/2 కప్పు,
పాలు- పిండి కలపడానికి సరపడా,
యాలకుల పొడి- 1/4 టీ స్పూను,
పంచదార- ఒకటిన్నర కప్పు,
నెయ్యి- 5 టేబుల్‌ స్పూన్లు
తయారీ విధానం:-
మైదా, బియ్యప్పిండి, బాదం పేస్ట్‌లను ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
కొద్దిగా పాలు తడిచేసుకుంటూ ఈ మిశ్రమాన్ని పూరీ పిండిలా కలిపి తడి గుడ్డ కప్పి అరగంటసేపు ఉంచాలి.
ఈ లోగా ఒక గిన్నెలో పంచదార, యాలకుల పొడి వేసి అరకప్పు నీళ్ళు పోసి తీగ పాకం పట్టుకోవాలి.
తరువాత పూరీ పిండిని చిన్న ఉండలుగా చేసి త్రికోణాకారంలో పూరీలు వత్తుకుని నేతిలో వేగించుకోవాలి.
ఆ తరువాత ఒక్కో పూరీని పంచదార పాకంలో వేసి వాటికి పాకం పట్టాక వెంటనే బయటకు తీసేయాలి.