బనానా చిప్స్‌

కావలసిన పదార్థాలు:- పచ్చి అరటి కాయలు - 3,
పసుపు - 1 టీస్పూను,
ఉప్పు - 1 లేదా 2 టీస్పూన్లు,
కొబ్బరి నూనె - 4 లేదా 5 కప్పులు
తయారీ విధానం:-
అరటికాయలకు గాట్లు పెట్టి పసుపు కలిపిన నీళ్లలో వేసి అరగంటపాటు ఉంచాలి.
బాండీలో నూనె పోసి పొగలు వచ్చేలా వేడి చేయాలి.
నీళ్ల నుంచి తీసిన అరటి కాయల్ని తడి లేకుండా తుడవాలి.
స్లయిసర్‌ సహాయంతో అరటి కాయలను చిప్స్‌లా నేరుగా నూనెలోనే తరగాలి.
చిప్స్‌ నూనెలో పడగానే చిటపటా పొంగుతాయి.
ఈ పొంగు తగ్గేవరకూ కలిపితే ఆలోగా చిప్స్‌ ఉడికిపోతాయి.
ఈలోపు రెండు కప్పుల నీళ్లలో ఉప్పు కలిపి చిప్స్‌ నూనెలో వేగుతున్నప్పుడే ఈ నీళ్లను చిలకరించి కలపాలి.
తర్వాత చిప్స్‌ను గరిటతో తీసి టిష్యూ పేపర్‌ మీద వేసి నూనె వదిలాక సర్వ్‌ చేయాలి.