కావలసిన పదార్థాలు:-
బ్రెడ్ స్లైసులు: పది,
పాలు: కప్పు,
ఉల్లిపాయలు, టమోటాలు, కాప్సికమ్, బంగాళాదుంప ముక్కలు: చెరో అరకప్పు చొప్పున(సన్నగా తరుక్కోవాలి),
పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు: చెరో టేబుల్ స్పూను,
కారం: అర స్పూను,
ఉప్పు: రుచికి సరిపడ,
గరం మసాలా: అర స్పూను,
నూనె: తగినంత
తయారీ విధానం:-
బ్రెడ్ ముక్కల అంచులను తీసేసి వాటిని పొడి చేసి పాలల్లో కొద్ది సేపు నానపెట్టుకోవాలి.
మిగిలిన వస్తువులన్నీ ఒక గిన్నెలో వేసి కొద్దిగా నూనె వేసి వాటిని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత నానపెట్టిన బ్రెడ్‌ను ముక్కలకు జతచేసి మందంగా పోసుకోవాలి.
అవసరం అనుకుంటే రెండు లేదా మూడు స్పూన్ల బియ్యంపిండి కలుపు కోవచ్చు. ఊతప్పం రాకపోతేనే బియ్యంపిండి కలుపుకోవాలి.
