ఆలు భుజియా

కావలసిన పదార్థాలు:-
శనగపిండి- అర కప్పు,
ఉడికించిన ఆలుగడ్డలు- రెండు,
పసుపు- అర టీ స్పూను,
కారం, మిరియాల పొడి, ఛాట్‌ మసాలా- అర టీ స్పూను చొప్పున,
ఉప్పు- తగినంత,
నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం:-
ఆలుగడ్డలను మిక్సీలో నీళ్లు పోయకుండా మెత్తగా రుబ్బుకోవాలి.
తర్వాత శనగపిండి, ఛాట్‌మసాలా, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి గట్టిగా కలుపుకోవాలి.
తర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఆలుగడ్డల మిశ్రమాన్ని చిన్న రంధ్రాలుండే కారప్పూస గిద్దలతో ఒత్తుకొని నూనెలో వేగించాలి.
కరకరలాడే భుజియా రెడీ.