సోరకాయ అప్పాలు

కావలసిన పదార్థాలు:-
సొరకాయ తురుము- ఒక కప్పు,
బియ్యప్పిండి- మూడు కప్పులు,
పచ్చిమిర్చి- పది (మెత్తగా రుబ్బుకోవాలి),
కారం- మూడు టేబుల్‌ స్పూన్లు,
నువ్వులు- రెండు టేబుల్‌ స్పూన్లు,
జీలకర్ర- ఒక టీ స్పూను,
ఉల్లిపాయ- ఒకటి,
కరివేపాకు, కొత్తిమీర- కొద్దిగా,
నూనె- వేగించడానికి సరిపడా,
ఉప్పు- తగినంత.
తయారీ విధానం:-
ఒక పాత్రలో నూనె మినహా మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి గారెల పిండిలా కలుపుకుని పావుగంట సేపు నానపెట్టుకోవాలి.
తర్వాత అప్పాల్లా చేసుకుని నూనెలో దోరగా వేగించుకోవాలి