కావలసిన పదార్థాలు:-
బొంబాయి రవ్వ - ఒక కప్పు,
కొబ్బరి తురుము - పావు కప్పు,
అరటిపండ్లు - నాలుగు,
పంచదార లేదా బెల్లం - అర కప్పు (రుచికి తగ్గట్టు),
ఉప్పు - చిటికెడు,
బేకింగ్ సోడా - అర టీస్పూన్,
నెయ్యి - సరిపడా.
తయారీ విధానం:-
అరటిపండ్లను చేతితో మెత్తగా మెదపాలి.
ఇందులో పైన చెప్పిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలిపి నీళ్లు పోసి ఇడ్లీ పిండిలా చేయాలి.
ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి పూసి పిండిని వేసి ఆవిరికి పావుగంట సేపు ఉడికించాలి.
అరటిపండు ఇడ్లీలను బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా స్నాక్ ఐటమ్‌గా కూడా లాగించొచ్చు.
