బ్రౌన్‌రైస్‌ ఇడ్లీ

కావలసిన పదార్థాలు:-
బ్రౌన్‌రైస్‌ - 400 గ్రాములు (సూపర్‌ బజార్‌లో దొరుకుతాయి),
ఉప్పు - రుచికి తగినంత,
ఆవాలు - ఒక టీస్పూను,
కరివేపాకు - రెండు రెబ్బలు,
పచ్చిమిర్చి - 2,
మెంతాకులు కొన్ని,
పెరుగు - వంద గ్రాములు.
తయారుచేసే విధానం:-
ఒక రాత్రంతా బియ్యాన్ని నానబెట్టాలి.
ఉదయూన్నే నీరు వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బేటప్పుడే పెరుగుని, ఉప్పుని కలిపి ఓ గంట నానబెట్టాలి.
ఇడ్లీ కుక్కర్లో పెట్టేముందు కాసిన్ని మెంతి ఆకుల్ని కలపండి.
ఆవిరి మీద 10నుండి 15 నిమిషాల పాటు ఉడికించండి.
ఆవాలు, కరివేపాకు, మిర్చిలతో తాళింపు పెట్టి ఇడ్లీలపై చల్లండి.
వీటిని వేడిగా కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. మినపప్పు అవసరం లేన ఇడ్లీ ఇది.