కావలసిన పదార్థాలు :-
మినప్పప్పు-1 కిలో,
దోసె బియ్యం-2 కిలోలు.
మెంతులు-10గ్రా,
అటుకులు-30గ్రా,
బియ్యం పిండి-100గ్రా,
పంచదార-10గ్రా,
ఉప్పు-తగినంత.
తయారుచేయు విధానం :-
మినప్పప్పు, దోసె బియ్యం, మెంతులు, అటుకులను మంచినీటిలో గంటసేపు నానబెట్టుకోవాలి.
వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తగా అయ్యే వరకు రుబ్బుకొని దానిని ఒక పాత్రలోకి తీసుకోవాలి.
అందులో బియ్యంపిండి, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే - దోసె పిండి రెడీ అయినట్లే! ఇప్పుడు స్టవ్‌పై పెనం ఉంచి, చిన్న గిన్నెతో దానిపై కొద్దిగా దోసె పిండి
వేసి, అదే గిన్నెతో అంచులు వెడల్పుగా అయ్యేంత వరకు రుద్దాలి.
ఒక్క నిమిషం ఆగి, దోసెపైన చూట్టూరా నూనె వేసి, అందులో బంగాళాదుంపలతో తయారు చేసిన మసాలా ఒక గరిటెడు వేసి, కాసేపు ఉంచి, ప్లేటులోకి తీసుకోవాలి.
తినేముందర దోసెపై ఓ టేబుల్‌స్పూన్ బట్టర్ వేస్తే చాలు..
వేడి వేడి బట్టర్ మసాలా దోసె రెడీ!
