కావలసిన పదార్థాలు:-
బాదం - 250 గ్రా.,
నెయ్యి - 60 గ్రా.,
పాలు (వేడివి) - అరలీటరు,
పంచదార - పావుకేజి,
యాలకులపొడి - అర టీ స్పూను,
కుంకుమపువ్వు - ఆరు కాడలు,
నేతిలో వేగించిన కొన్ని బాదం (నిలువుగా కోసుకోవాలి) ముక్కలు అలంకరణకోసం.
తయారుచేసే విధానం:-
బాదంపప్పుని ముందుగా నానబెట్టి తొక్క తీసి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి.
కడాయిలో నెయ్యి వేడి చేసి ఈ పేస్టుని సన్నని మంటపై దోరగా వేగించి, పాలు కలిపి చిక్కబడేదాక ఉంచాలి.
తర్వాత పంచదార వేసి కరిగాక, యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి దించేయాలి.
తర్వాత నేతిలో వేగించిన బాదం ముక్కల్ని అలంకరించుకోవాలి.
