లడ్డు

కావలసిన పదార్థాలు :-
శనగపిండి(మెత్తనిది)-ఒక కేజి,
పంచదార-రెండు కేజీలు,
ఎండు ఖర్జూరం-200గ్రా,
పాలు-రెండు లీటర్లు,
యాలకులు-50గ్రా,
నెయ్యి-నాలుగు కేజీలు,
జీడిపప్పు-350గ్రా,
బాదంపప్పు-200గ్రా,
కిస్‌మిస్‌-150గ్రా,
పటికబెల్లం-200గ్రా,
పచ్చకర్పూరం-7గ్రా.
తయారుచేసే విధానం :-
ఎండు ఖర్జూరాన్ని వేడి నీటిలో వేసి గంటసేపు నానబెట్టాలి.
పాలు మరిగించి దించి చల్లార్చాలి.
ఒక కళాయిలో పంచదార వేసి, నీళ్లు పోసి స్టవ్‌పై ఉంచి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి.
మరీ లేతగా, మరీ ముదురుగా కాకుండా సమపాకం పట్టుకోవాలి.
కళాయిని కిందికి దింపి, యాలకుల పొడి వేసి కలపాలి.
ఒక గరిటెలో బాగా కాచిన నెయ్యి తీసుకుని అందులో పచ్చ కర్పూరం వేసి అది కరిగిన వెంటనే ఆ నెయ్యిని పంచదార పాకంలో పోయాలి.
చల్లారిన పాలలో శనగపిండి వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి.
మరో కళాయి స్టవ్‌పై ఉంచి అందులో నెయ్యి వేసి అది మరిగిన తరువాత బూందీ దూసే చిల్లుల గరిటెలో శనగపిండి వేసి చేతితో కలుపుతూ బూందీ వేసుకోవాలి.
ఈ బూందీని పక్కన ఉంచుకున్న పాకంలో వేసి బాగా కలపాలి.
తరువాత వేడినీటిలో నానబెట్టిన ఎండు ఖర్జూరాన్ని తీసి నేతిలో వేయించి బూందీలో వేసి కలపాలి.
జీడిపప్పు, కిస్‌మిస్‌, బాదంపప్పు, పిస్తాపప్పు వీటన్నింటినీ నేతిలో వేయించుకుని బూందీలో వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గంటసేపు అలాగే ఉంచి, తరువాత పటికబెల్లాన్ని ముక్కలుగా చేసి బూందీ మిశ్రమంలో వేసి బాగా కలిపి అర చేతికి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని
కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి.