కావలసినవి:-
సిమ్లా యాపిల్స్ - 4,
పంచదార - నాలుగు కప్పులు,
రోజ్‌వాటర్ - ఒక స్పూన్,
కొద్దిగా నీళ్లు, జీడి పప్పులు - 20 (వేగించి)
తయారి విధానం:-
ముందుగా యాపిల్స్‌ను కోసి విత్తనాలు తీసివేయాలి.
ఒక గిన్నెలో పంచదార వేసి, నీళ్లు పోసి పాకం పట్టాలి.
ఈ పాకంలో యాపిల్ ముక్కలు వేసి 20 నిమిషాల పాటు ఉడికించాలి.
ముక్కలు పాకం పీల్చుకుంటాయి.
ఇందులో జీడిపప్పు, రోజ్‌వాటర్ వేసి చల్లారిన తరువాత తినాలి.
పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడతారు ఈ వంటకాన్ని.
