కావలసినవి:-
బియ్యప్పిండి - ఒక కేజి,
బెల్లం - పావుకేజి,
వెన్న - 200 గ్రాములు,
నూనె - రెండు కప్పులు,
యాలకులపొడి- మూడు టీస్పూన్లు.
తయారీ:-
కొంచెం బియ్యప్పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఇందులో 75 గ్రాముల వెన్న వేయాలి.
కొన్ని నీళ్లు పోసి పిండిని బాగా కలిపి ముద్దగా చేయాలి.
పాన్‌లో నూనె పోసి వేడిచేయాలి.
నూనె వేడెక్కేలోపు కలిపిన పిండి ముద్దను చిన్న చిన్న ఉండలు చేయాలి.
కాగిన నూనెలో ఈ ఉండల్ని వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
ఇవి వేగుతున్నప్పుడే బెల్లం పాకం పట్టాలి. అందులో యాలకులపొడి వేయాలి.
వేగిన వెన్న ఉండల్ని బెల్లం పాకంలో వేయాలి.