ఆపిల్‌ పకోడీ

కావలసినవి:-
మైదా పిండి- నాలుగు కప్పులు,
పాలు- ముప్పావు లీటరు,
ఉప్పు- పావు టీస్పూను,
ఆపిల్స్‌- ఆరు,
నూనె- ఎనిమిది కప్పులు,
చక్కెర- తగినంత.
తయారీ:-
ఒక గిన్నెలో మైదాపిండి, పాలు, ఉప్పు వేసి దోశెల పిండిలా కలపాలి.
ఆపిల్స్‌పై తొక్క తీసేసి ముక్కలుగా కట్‌చేసుకోవాలి.
ఈ యాపిల్‌ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో డీప్‌ఫ్రై చేయాలి.
అవి గోధుమరంగులోకి మారిన తరువాత తీస్తే సరి.
రుచికరమైన ఆపిల్‌ పకోడీలు రెడీ..! వీటిని వేడిగా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది.