కావలసినవి:-
సాండ్‌విచ్ బ్రెడ్ స్లైస్‌లు 6 లేక 8,
పనీర్ 100 గ్రా.,
తరిగిన ఉల్లిపాయ ఒకటి,
గరం మసాలా ఒకటిన్నర టీ స్పూన్,
కారం ఒక టీ స్పూన్,
అల్లం వెల్లుల్లి ముద్ద అర టీ స్పూన్,
శనగపిండి ఒక కప్పు,
ఉప్పు తగినంత,
నీళ్లు ఒక కప్పు ,
నూనె వేగించడానికి
ఎలా చేయాలి:-
ముందుగా పనీర్‌ను తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
బాణలిలో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసి అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలను వేగించాలి.
తర్వాత పనీర్, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మరి కొద్ది సేపు వేగించాలి.
ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్రెడ్ స్లయిస్‌ల చివర్లను తొలగించి, త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి.
శనగపిండిలో చిటికెడు ఉప్పు వేసి, నీళ్లు పోస్తూ ముద్దలా కలుపుకోవాలి.
పనీర్, ఉల్లి, మసాలా మిశ్రమాన్ని త్రికోణాకారపు బ్రెడ్ స్లైస్ మీద పరిచి దాని పైన మరో స్లైస్ పెట్టాలి.
ఇలా అన్ని స్లైసెస్‌ను తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో తగినంత నూనె పోసి కాగనివ్వాలి.
శనగపిండి మిశ్రమంలో బ్రెడ్ స్లైసెస్‌ను ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
వీటిని ఒక పేపర్ మీద వేసి కొద్ది సేపు ఉంచితే నూనె లేకుండా పొడిగా అవుతాయి.
వీటిని స్నాక్స్ టైమ్‌లో వేడి వేడిగా తింటే చాలా బావుంటాయి.
