కొబ్బరి లడ్డు

కావలసిన పదార్థాలు:-
రెండు చిప్పల కొబ్బరి తురుము,
పాలు: లీటరు(నీరు కలపని పాలు),
చక్కెర: మూడు వందల గ్రాములు,
బొంబాయి రవ్వ: అరకప్పు,
యాలకుల పొడి: చిటికెడు,
చెర్రీ పండ్లు: కొన్ని.
తయారీ విధానం:-
మందపాటి గిన్నెలో కొబ్బరి తురుము, పాలు, చక్కెర వేసి బాగా మరగనివ్వాలి.
ఈ మిశ్రమం గట్టిపడుతున్న సమయంలో బొంబాయిరవ్వ, యాలకుల పొడి వేసుకోవాలి.
కొద్ది నిమిషాలు పొయ్యిమీద ఉంచి దించేసుకోవాలి.
ఈ మిశ్రమం చల్లారిన తరువాత లడ్డూల్లాగా కట్టుకోవాలి.
అన్నీ తయారు చేసుకున్న తరువాత వాటి పైన చెర్రీ పండ్లతో అలంకరించుకోవాలి.