బెల్లం పొంగలి

కావలసినవి:-
బియ్యం, బెల్లం (పొడి చేసి) - ఒక్కో కప్పు చొప్పున,
పచ్చి శెనగపప్పు - పావు కప్పు,
నీళ్లు - మూడు కప్పులు,
పాలు - ఒకటింబావు కప్పు,
యాలకుల పొడి - అర టీస్పూన్‌,
ఎండు కొబ్బరి ముక్కలు - ఒక టేబుల్‌ స్పూన్‌,
జీడిపప్పు, ఎండుద్రాక్షలు - కొన్ని,
నెయ్యి - మూడు టేబుల్‌ స్పూన్లు.
తయారీ:-
బియ్యం, పచ్చి శెనగపప్పుల్ని శుభ్రంగా కడిగి మూడుకప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో మూడు నాలుగు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి.
స్టవ్‌ ఆపేసి కుక్కర్‌లో ఆవిరి పూర్తిగా పోయేవరకు ఉండాలి.
ఉడికించిన బియ్యం, శెనగపప్పుల మిశ్రమంలో పాలు, యాలకుల పొడి కలిపి నాలుగు నిమిషాలు సన్నటి మంట మీద ఉడికించాలి.
స్టవ్‌ మీద నుంచి గిన్నెను కిందకు దించి అందులో బెల్లం తురుము వేసి గరిటెతో బాగా కలియబెట్టి మూతపెట్టాలి.
రెండు నిమిషాల తరువాత మరోసారి కలిపితే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది.
నెయ్యిని పాన్‌లో వేడిచేసి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండుద్రాక్షలను బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత వాటిని పొంగలి మీద అలంకరించాలి.