కావలసిన పదార్థాలు:-
(శుభ్రపరచిన - తల, తోక లేకుండా) కొరమీను ముక్కలు - డజను,
ఉప్పు - సరిపడా,
నూనె - 4 టేబుల్ స్పూన్లు,
ఉల్లిపాయలు - 2,
పచ్చిమిర్చి - 4,
పసుపు - చిటికెడు,
కారం - 2,
ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్ల చొప్పున,
అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను,
ఎండుకొబ్బరి పేస్టు - అరకప్పు,
గరం మసాల పొడి - ఒక టీ స్పూను,
కొత్తిమీర తరుగు - అరకప్పు,
నీరు - 3 కప్పులు.
తయారుచేసే విధానం:-
ఒక వెడల్పాటి పాత్రలో చేపలతో పాటు ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల పొడి, ఉల్లి తరుగు, చీలిన పచ్చిమిర్చి వేసి అన్నీ బాగా కలిపి గంట సేపు పక్కనుంచాలి.
వెడల్పాటి కడాయిలో నూనె వేసి ఒక్కో కొరమీను ముక్కా సర్దుతూ, ముక్క విరగకుండా రెండువైపులా వేగించాలి.
ఇప్పుడు కొబ్బరిపేస్టు, నీరు పోసి మూతపెట్టి కదపకుండా మగ్గించాలి. నీరంతా ఇగిరిపోయి కూర దగ్గరవగానే కొత్తిమీర చల్లి మంట ఆపేయాలి.
