ఉసిరి పప్పు

కావలసిన పదార్ధాలు:-
ఉసిరికాయలు- 6 (ముక్కలుగా తరగాలి),
కందిపప్పు- కప్పు,
నూనె- 4 టీ స్పూన్లు,
పసుపు- చిటికెడు,
ఇంగువ- చిటికెడు,
ఎండుమిర్చి- 6,
పచ్చిమిర్చి - 4,
కరివేపాకు- 2 రెమ్మలు,
పోపుగింజలు- 3 టీ స్పూన్లు,
ఉల్లిపాయ - 1
తయారీ విధానం:-
ముందుగా పప్పు, ఉసిరికాయ ముక్కలు విడివిడిగా ఉడకబెట్టుకోవాలి.
తర్వాత వాటిని మెత్తగా మెదుపుకోవాలి.
బాణలిలో నూనెపోసి, వేడయ్యాక, ఇంగువ, కరివేపాకు, పోపుగింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.
చిన్న ఉల్లిపాయను నిలువుగా తరిగి దానిని కూడా పోపులో వేయించాలి.
ఉల్లిపాయ వేగిన తర్వాత, మెదుపుకున్న పప్పును కూడా బాణలిలో వేయాలి.
తర్వాత ఉప్పు, టీ స్పూను పచ్చికారం వేసి బాగా కలపాలి.
పదినిమిషాలు ఉడకనిచ్చి, తర్వాత దించాలి.
వేడివేడి అన్నంలో ఉసిరికాయపప్పు, నెయ్యి వేసి కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది.