కావలసిన వస్తువులు :-
చికెన్: అరకిలో.
సగం ఉడికిన అన్నం: ఒకటిన్నర కిలో,
ఆలు: నాలుగు లేదా ఐదు(కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి),
దాల్చిన చెక్క: చిన్న ముక్క,
యాలకులు: నాలుగు లేక ఐదు,
మిరియాలు: కొన్ని,
బిర్యానీ ఆకు: కొద్దిగా,
పచ్చిమిర్చి: ఎనిమిది,
ఉల్లిపాయ ముక్కలు: రెండు కప్పులు,
కారం: సరిపడ,
నిమ్మరసం: టేబుల్ స్పూను,
కొత్తిమీర ఆకులు: కప్పు,
కుంకుమపువ్వు: కొద్దిగా,
ఉప్పు: రుచికి సరిపడ,
నూనె: తగినంత,
అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు స్పూన్లు
తయారీ విధానం :-
ముందుగా బియ్యాన్ని సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
ఓ పెద్ద గిన్నెలో చికెన్ ముక్కలు, కారం, ఉప్పు, నిమ్మరసం, చిటికెడు పసుపువేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బాండీ లేదా పాన్‌లో నూనె వేసి బంగాళాదుంప ముక్కలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే నూనెలో పచ్చిమిరపకాయలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించుకోవాలి.
వీటికి ఉల్లిపాయ ముక్కలు జతచేర్చి మరికొద్దిసేపు వేయించి అనంతరం అల్లం వెల్లుల్లిముద్ద కూడా జతచేయాలి.
అన్నీ వేగిన తరువాత చికెన్ ముక్కలు వేసి మరికొద్ది సేపు వేయించి చివరగా బంగాళాదుంప ముక్కలు జతచేయాలి.
ఉడికిన అన్నాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం మీద వేయించి పెట్టుకున్న మిశ్రమంలో సగభాగాన్ని తీసుకుని లేయర్‌గా పరుచుకోవాలి.
దానిపైన మిగతా అన్నం వేసి మిగతా కూరను కూడా పరిచి కుక్కర్‌లో ఒకటి లేదా రెండు విజిల్స్ మాత్రమే వచ్చేవరకు ఉంచి దింపేయాలి.
చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.

