అలసంద కర్రీ

కావలసిన పదార్థాలు :-
అలసందలు - 1 కప్పు,
టమోటా - 1,
అల్లం తరుగు - 1 టీ స్పూను,
కారం - 1 టీ స్పూను,
జీరా పొడి - 1 టీ స్పూను,
ఉప్పు - రుచికి తగినంత,
పంచదార (ఇష్టమైతే) - 1 టీ స్పూను,
ఉల్లిపాయ - 1,
నూనె - 1 టేబుల్‌ స్పూను,
పచ్చిమిర్చి - 2,
కరివేపాకు - 4 రెబ్బలు,
కొత్తిమీర తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం:-
అలసందలను ఒక రాత్రంతా నానబెట్టాలి.
కుక్కర్లో ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం తరుగులతో పాటు, టమోటా ముక్కలు, కరివేపాకు, జీరాపొడి, కారం ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి.
తర్వాత అలసందల్ని వేసి 2 నిమిషాల తర్వాత 3 కప్పుల నీరు పోసి 1 విజిల్‌ వచ్చేక స్టౌవ్‌ కట్టేయాలి.
చల్లారిన తర్వాత పంచదార, ఉప్పు చల్లి మరో 5 నిమిషాలు సన్నని మంటపై ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.
ఈ కర్రీ పరాటాలతో మంచి కాంబినేషన్‌.