ఆవ పొట్లకాయ

కావలసిన పదార్థాలు :- పొట్లకాయ -1,
పచ్చిమిర్చి - 2,
పుట్నాలు -1 టేబుల్‌స్పూను,
ఆవాలు - అర టీ స్పూను,
వెల్లుల్లి - 4 రేకలు,
కరివేపాకు - 4 రెబ్బలు,
ఉప్పు - రుచికి సరిపడా,
పసుపు - చిటికెడు,
పెరుగు 1 కప్పు,
నూనె - 2 టీ స్పూన్లు,
ఎండుమిర్చి - 2,
తాళింపు గింజలు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం:- పొట్లకాయని గుండ్రంగా తరిగి గింజలు తీసి శుభ్రం చేసుకోవాలి.
పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, ఆవాలు మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి.
కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, తాళింపు గింజల్ని వేగనిచ్చి పొట్లకాయ ముక్కల్ని కూడా వేసి (అవసరం అనిపిస్తే ఒక కప్పు నీరు కలిపి) మెత్తగా ఉడికించి, చల్లారనివ్వాలి.
ఒక పాత్రలోకి పెరుగు తీసుకుని అందులో పొట్లకాయ ముక్కల్ని, ఆవ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
ఇది అన్నంతో పాటు పరాటాల్లోకి కూడా బాగుంటుంది.