కావలిసిన పదార్థాలు:-
కాకరకాయలు నాలుగు,
ఆలుగడ్డలు మూడు,
ఉప్పు, కారం తగినంత,
నిమ్మరసం నాలుగు టేబుల్ స్పూనులు,
ఉల్లిపాయలు రెండు, అల్లం, వెల్లుల్లి తగినంత,
జీలకర్ర 1 టేబుల్ స్పూన్,
పసుపు తగినంత,
పోపు గింజలు తగినంత,
గరంమసాలా తగినంత.
తయారు చేయు విధానం:-
ముందుగా ఆలుగడ్డలను ఉడకబెట్టి పొట్టు తీసి మెత్తగా చేసుకోవాలి.
గిన్నెలో నూనె పోసుకుని ఉల్లిపాయ ముక్కలను వేయాలి.
జీలకర్ర, పోపుగింజలు, అల్లం వెల్లుల్లి, పసుపు వేయాలి.
బాగా వేగిన తర్వాత వెత్తగా చేసిన ఆలును వేయాలి.
కారం, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. కాసేపయ్యాక గరంమసాలా వేయాలి.
తర్వాత చిన్నగా తరిగిన కాకరకాయ ముక్కలను నూనెలో వేసి వేగించాలి.
ఈ ముక్కల్లోకి ఆలు ముద్దలను చేర్చాలి.
తిరిగి నూనెలో ఈ ఆలును చేర్చిన కాకరకాయ ముక్కలను వేసి డీప్ ఫ్రైచేయాలి.
తర్వాత కొంచెం నిమ్మరసం, మసాల పొడి చల్లుకోవాలి.
