ఫిష్‌ వేపుడు

కావలసిన పదార్థాలు:-
చేపలు - కిలో,
ఉల్లిపాయ - ఒకటి,
అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టేబుల్‌ స్పూన్లు,
కారం - మూడు టీ స్పూన్లు,
ఉప్పు - తగినంత,
మసాల పొడి - రెండు టీ స్పూన్లు,
పసుపు - కొద్దిగా,
నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:-
ముందుగా చేపల్ని శుభ్రం చేసుకుని మనకి కావల్సిన సైజులో కట్‌ చేసుకోవాలి.
తరువాత ఉల్లిపాయని కోసి మెత్తగా రుబ్బుకోవాలి.
దీన్ని ఒక గిన్నెలో వేసుకుని అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, పసుపు, మసాల పొడి, పసుపు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసి మిశ్రమం అంతా చేపముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి.
ఒక గంట తర్వాత స్టౌ వెలిగించి మందంగా ఉన్న పెనం పెట్టి కొద్దిగా నూనె పొయ్యాలి.
కాగిన తర్వాత చేప ముక్కల్ని రెండు చొప్పున వేసి వేయించుకోవాలి.
సన్నని మంటపై వేయిస్తే చేప బాగా ఫ్రై అవుతుంది.
తర్వాత దింపుకుని దీన్ని వేయించిన కరివేపాకుతో, కొత్తిమీర తురుముతో అలంకరించుకోవాలి.